లైంగికదాడి కేసులో నిందితుల అరెస్టు | The arrest of the accused in sexual assault case | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో నిందితుల అరెస్టు

Jan 5 2017 12:16 AM | Updated on Sep 26 2018 5:59 PM

లైంగికదాడి కేసులో నిందితుల అరెస్టు - Sakshi

లైంగికదాడి కేసులో నిందితుల అరెస్టు

మండలంలోని సైదాపూర్‌ తండాకు చెందిన వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డ అదే తండాకు చెందిన ఇద్దరు నిందితులను

వర్ని : మండలంలోని సైదాపూర్‌ తండాకు చెందిన వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డ అదే తండాకు చెందిన ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్నిలో పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో వివరాలు వెల్లడించారు. సైదాపూర్‌ తండాకు చెందిన రమేశ్, బాబు అనే యువకులు ఈ నెల 26న రాత్రి తండాకు చెందిన వివాహితను బలవంతంగా బైక్‌పై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి కర్రతో కొట్టారని పేర్కొన్నారు. దీంతో బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు.

శరీరంపై ఉన్న దెబ్బలను గుర్తించిన బాధితురాలి తల్లి ప్రశ్నించడంతో విషయం వెల్లడించింది. దీంతో ఈ నెల 30న బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రుద్రూర్‌ సీఐ శేఖర్‌ రెడ్డి కేసును దర్యాప్తు చేశారు. నిందితులను మంగళవారం వ్యవసాయ పొలంలో అరెస్టు చేసి విచారించగా అత్యాచారం చేసినట్లు అంగీకరించారని తెలిపారు. సమావేశంలో రుద్రూర్‌ సీఐ శేఖర్‌ రెడ్డి, వర్ని ఎస్సై అంజయ్య పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement