హాయ్ల్యాండ్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు | the Andhra pradesh budget session in Haailand Resorts | Sakshi
Sakshi News home page

హాయ్ల్యాండ్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

Jan 15 2016 9:31 AM | Updated on Aug 18 2018 9:30 PM

హాయ్ల్యాండ్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు - Sakshi

హాయ్ల్యాండ్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

మార్చిలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గుంటూరులోని హాయ్ల్యాండ్ రిసార్టులో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్ : మార్చిలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాయ్ల్యాండ్ రిసార్టులో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి తుది మ్యాప్ను అధికారులు ఖరారు చేశారు. హాయ్ల్యాండ్ లోని ఒకే ప్రాంగణంలో ఏపీ శాసన సభ, మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాలకు అనుగుణంగా ప్రాంగణాన్ని రూపొందించేందుకు రూ.12 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని సర్కార్ నిర్ణయించింది. శాసన సభ ఏర్పాట్లను చూసే కాంట్రాక్ట్ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వనున్నారు. సీఆర్డీఏ ద్వారా కాంట్రాక్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement