కదిరి మున్సిపల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన రాజు కుమార్తె రజిత(15) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు.
కదిరి టౌన్ : కదిరి మున్సిపల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన రాజు కుమార్తె రజిత(15) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే ఆమె, తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఎలుకల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.