కదిరిలో ఉద్రిక్తత | tension siituation infront of kadiri governmet hospital | Sakshi
Sakshi News home page

కదిరిలో ఉద్రిక్తత

Sep 25 2016 2:10 PM | Updated on Sep 4 2017 2:58 PM

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

కదిరి(అనంతపురం): అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా డెంగీతో పాటు పలు విషజ్వరాలు ప్రభలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన సీపీఐ కార్యకర్తలు కదిరి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఆస్పత్రిని సందర్శించడానికి వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేష్‌బాబుతో సీపీఐ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో అధికారిపై నిరసనకారులు దాడి చేశారు. ఈ దాడిలో అధికారి చొక్కా చినిగిపోయి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల రంగ ప్రవేశంతో.. పరిస్థితి అదుపులోకి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement