కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత | Tension on machilipatnam mandal kummaripalem | Sakshi
Sakshi News home page

కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత

Jan 2 2017 6:39 PM | Updated on Sep 5 2017 12:12 AM

కృష్ణాజిల్లా బందరు మండలం కుమ్మరిపాలెంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.

బందరు: కృష్ణాజిల్లా బందరు మండలం కుమ్మరిపాలెంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ నిమిత్తం భూసేకరణకు వచ్చిన ప్రభుత్వాధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మించిన పేదల ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ప్రతిఘటించారు.

దీనికి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, వామపక్ష నేతలు కూడా మద్ధతు పలికారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను , స్థానికులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నానిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement