కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో "మోంథా" తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు. గాలుల ధాటికి 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీలో దెబ్బతిన్న పూరిగుడిసెలు. దాంతో తల దాచుకునేందుకు ఆంధ్రజాతీయ కళాశాలకు వెళ్లిన బాధితులు. అయితే బాధితులకు పునరావాసం కల్పించేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత వ్యక్తం చేశారు.
ఇక గత్యంతరం లేక కళాశాల వరండాలోనే తలదాచుకున్న తుఫాన్ బాధితులు. విషయం తెలుసుకుని తుఫాన్ బాధితులకు వైసిపి కార్పొరేటర్ రాం ప్రసాద్ అండగా నిలిచారు. వారికి తాగునీరు , అల్పాహారం అందజేశారు.


