టెండర్లు దాటని ఠికానా | Tenders exceeding for MLA's camp offices | Sakshi
Sakshi News home page

టెండర్లు దాటని ఠికానా

Aug 17 2016 10:52 PM | Updated on Oct 30 2018 5:17 PM

టెండర్లు దాటని ఠికానా - Sakshi

టెండర్లు దాటని ఠికానా

శాసనసభ్యులకు నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం మెుదలు కావడ లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు శాశ్వతంగా క్యాంపు కార్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ బాధ్యతలను రహదారులు–భవనాల శాఖకు అప్పగించింది. ఒక్కొక్క క్యాంపు కార్యాలయ నిర్మాణానికి కోటి రూపాయల చొప్పున నిధులను కేటాయించింది.

  • మొదలుకాని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లు
  • నిధులు కేటాయించి రెండేళ్లు
  • ముందుకు సాగని నిర్మాణాలు
  • ఎట్టకేలకు స్థలాల కేటాయింపు పూర్తి
  •  నాలుగు చోట్ల రెండోసారి టెండర్లు పిలుపు
  • సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : శాసనసభ్యులకు నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం మెుదలు కావడ లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు శాశ్వతంగా క్యాంపు కార్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ బాధ్యతలను రహదారులు–భవనాల శాఖకు అప్పగించింది. ఒక్కొక్క క్యాంపు కార్యాలయ నిర్మాణానికి కోటి రూపాయల చొప్పున నిధులను కేటాయించింది.
     
    ఈ ప్రక్రియ మొదలై రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా పనులు మొదలవడం లేదు. శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపుల్లో తీవ్ర జాప్యం జరిగింది. కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో ఉండాలని, వాస్తుపరంగా రహదారులు ఉన్న స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేలు రెవెన్యూ అధికారులకు సూచించారు. దీంతో కొంత జాప్యం జరిగింది. డోర్నకల్‌ నియోజకవర్గ ప్రజలు మరిపెడకు వస్తారని అందువల్ల అక్కడే స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కలెక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు క్యాంపు కార్యాలయానికి కలెక్టర్‌ స్థలం కేటాయించారు. ఇలా జిల్లాలోని 12 నియోజకవర్గాలకు స్థలాలు కేటాయించడంతో టెండర్ల నిర్వహణకు మార్గం సుగమమైంది. 
     
    రెండోసారి పిలుపు...
     ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు స్థలాలు కేటాయించడంతో పనులు పర్యవేక్షించే ప్రక్రియను రోడ్లు, భవనాల శాఖ చేపట్టింది. 12 నియోజవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి టెండరు పిలిచింది. వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, పరకాల, ములుగు, భూపాలపల్లి, జనగామ, వర్థన్నపేట, స్టేషన్‌ఘనపూర్‌ నియోజకవర్గాల్లో నిర్మాణాలకు టెండర్లు ఖరారయ్యాయి. ఐదు క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులను ఒకే సంస్థ దక్కించుకుంది. మరో మూడు క్యాంప్‌ ఆఫీసు నిర్మాణాల పనుల టెండరు ప్రతిపాదనలను చీఫ్‌ ఇంజనీరు ఆమోదం తెలపాల్సి ఉంది.
     
    మిగతా నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజవర్గాల్లో నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో రెండోసారి టెండర్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మాణం చేపట్టేందుకు రోడ్లు, భవనాల శాఖ టెండర్లు పిలిచినా ఆయా ఎమ్మెల్యేల ఆమోదం ఉంటేనే టెండర్లు దాఖలు చేసే పరిస్థితి ఉందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ కారణంగానే నాలుగు నియోజకవర్గాల్లో నిర్మాణాలకు టెండర్లు దాఖలు కాలేదని తెలిసింది. 
     
    నిర్మాణం ఇలా..
    శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాల భవనాలకు 60 గజాల వెడల్పు, 90 గజాల పొడవుతో స్థలాలను కేటాయించారు. ఒక్కో అంతస్తు 2100 ఫీట్ల విస్తీర్ణంలో ఉంటాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రెండు కార్లు పార్కింగ్‌ చేసే విధంగా షెడ్డు, రిసెప్షనిస్టు, ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వచ్చే సందర్శకులు వేచి ఉండే గదులు, ఎమ్మెల్యే ఛాంబర్, యాంటి రూం(అంతర్గతంగా మాట్లాడేందుకు), 20 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించే హాల్‌లను నిర్మిస్తారు. ఎమ్మెల్యేలు నివాసం ఉండే విధంగా వంట గది, సందర్శకుల గది, పూజ గది, డైనింగ్‌హాల్, ఒక మాస్టర్‌ బెడ్‌రూం, చిల్డ్రన్స్‌ బెడ్‌రూం, అతిథుల కోసం మరో బెడ్‌రూం ఉండే విధంగా మొదటి అంతస్తును నిర్మిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement