టేకు దుంగల పట్టివేత | teak staves | Sakshi
Sakshi News home page

టేకు దుంగల పట్టివేత

Oct 6 2016 10:28 PM | Updated on Sep 4 2017 4:25 PM

టేకు దుంగల పట్టివేత

టేకు దుంగల పట్టివేత

ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో బుధవారం రాత్రి అక్రమంగా టేకు కలపను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. మామిడిపల్లి

ఆర్మూర్‌అర్బన్‌ :
 ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో బుధవారం రాత్రి అక్రమంగా టేకు కలపను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. మామిడిపల్లి వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటో ట్రాలీని ఆపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కాగా డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాహనాన్ని పరిశీలించగా అందులో ఆరు ఫీట్ల పొడవు ఉన్న 12 టేకు దుంగలు ఉన్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. వాహనాన్ని డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి సందీప్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. వాహనాన్ని పట్టుకున్న ఎస్సైలు సంతోష్, యాకూబ్, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మారం, కానిస్టేబుల్‌ నరేశ్‌ను ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement