టీడీపీ నేతా.. మజాకా..! | tdp leaders stops CI srinivasulu charges in ysr district | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతా.. మజాకా..!

Apr 30 2016 10:03 AM | Updated on Aug 11 2018 8:15 PM

టీడీపీ నేతా.. మజాకా..! - Sakshi

టీడీపీ నేతా.. మజాకా..!

ప్రొద్దుటూరు అర్బన్‌ సీఐగా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన శ్రీనివాసులుకు చుక్కెదురైంది. స్థానిక అధికార పార్టీ నేత ఒకరు పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సీఐని విధుల్లో చేరనీయలేదు.

సీఐ బాధ్యతలు తీసుకోవద్దంటూ టీడీపీ నేత హుకుం జారీ
► ఎస్పీని కలిసినా ప్రయోజనం శూన్యం
► కర్నూలుకు తిరిగి పయనం
► సీఐ శ్రీనివాసులుకు చుక్కెదురు
 

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు అర్బన్‌ సీఐగా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన శ్రీనివాసులుకు చుక్కెదురైంది. స్థానిక అధికార పార్టీ నేత ఒకరు పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సీఐని విధుల్లో చేరనీయలేదు. దీంతో బదిలీ ఉత్తర్వులతో వచ్చిన ఆ సీఐ వెనుతిరిగి పోయారు.

వివరాల్లోకెళితే... ప్రొద్దుటూరు అర్బన్‌ సీఐ కుర్చీ మూడు నెలల నుంచి ఖాళీగా ఉంది.  కర్నూలు వీఆర్‌లో ఉన్న జె.శ్రీనివాసులును అర్బన్‌ సీఐగా నియమిస్తూ గురువారం సాయంత్రం డీఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించడానికి ప్రొద్దుటూరు వచ్చారు. రాగానే అధికార పార్టీ సీనియర్‌ నాయకుడిని కలవడానికి ప్రయత్నించగా కుదరలేదు. చేసేదేమి లేక సీఐ ఫోన్‌లో మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం.

సీఐ ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆ నేత వినిపించుకోలేదని తెలిసింది. అనంతరం పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మల్లేల లింగారెడ్డితో మాట్లాడారు. అనంతరం సీఐ శ్రీనివాసులు ఎస్పీని కలిసేందుకు కడప వెళ్లారు. ఆయన ఎస్పీని కలిసిన కొన్ని నిమిషాల్లోనే అర్బన్‌ సీఐగా చార్జ్‌ తీసుకోవద్దని అధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. సీనియర్‌ నేత ఒత్తిడి మేరకే హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు కడప ఎస్పీ కార్యాలయానికి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీఐ కర్నూలుకు వెళ్లిపోయారు. అర్బన్‌ సర్కిల్‌కు తమకు అనుకూలమైన సీఐని వేయించుకోవడానికి మూడు నెలల నుంచి అధికార పార్టీ సీనియర్‌ నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement