జన్మభూమిలో టీడీపీ నాయకుల దౌర్జన్యం | tdp leaders assault at janmabhoomi | Sakshi
Sakshi News home page

జన్మభూమిలో టీడీపీ నాయకుల దౌర్జన్యం

Jan 5 2017 12:57 AM | Updated on Aug 10 2018 8:23 PM

జన్మభూమిలో టీడీపీ నాయకుల దౌర్జన్యం - Sakshi

జన్మభూమిలో టీడీపీ నాయకుల దౌర్జన్యం

జన్మభూమి గ్రామ సభల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారు.

- సమస్యలపై ప్రశ్నిస్తే బెదిరింపులు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జన్మభూమి గ్రామ సభల్లో  తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కర్నూలు మండలం  ఆర్‌. కొంతలపాడులో ఇదే జరిగింది. ఎన్టీఆర్‌ ఇళ్లు కొందరికే ఇస్తున్నారని..ఇదేం న్యాయం అని ప్రశ్నించినందుకు టీడీపీకి చెందిన ఆ గ్రామ సర్పంచ్‌ సాయికృష్ణ చెలరేగిపోయారు. మరో సారి ఇలా ప్రశ్నిస్తే అంతుచూస్తానంటై ఆగ్రహంతో ఊగిపోయారు. సర్పంచ్‌ ఆగ్రహం చూసి అధికారులు సైతం విస్తుపోయారు. తగిన న్యాయం చేయమని అడిగినందుకు అధికార పార్టీ నాయకుడు బెదిరింపులకు దిగడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిలో జన్మభూమి ..టీడీపీ కార్యక్రమంగా మారింది.

నియోజకవర్గ తెలుగు దేశం ఇన్‌చార్జీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరుగుతుండటం..టీడీపీ నేతల  హడావుడి ఎక్కువగా ఉండటం గమానార్హం. పాణ్యం నియోజకవర్గంలో పాఠశాలల్లో జన్మభూమి గ్రామ సభలు నిర్వహిస్తుండటంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోంది. ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని పొదుపు మహిళలు చుట్టుముట్టి.. తమకు పెట్టుబడి నిధి కింద ఒక్క రూపాయి కూడ రాలేదని ధ్వజమెత్తారు. బేతంచెర్ల, పాణ్యం, ఆళ్లగడ్డ, పత్తికొంద, ఆదోని తదితర ప్రాంతాల్లో ప్రజాసమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం నేమకల్‌లో జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గత జన్మభూమిలో ప్రస్తావించిన సమస్యలకు ఇంత వరకు దిక్కులేకుండా పోయిందని నిలదీశారు.  గ్రామస్థుల ప్రశ్నలకు సమాధనం చెప్పలేక అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించకుండా వెళ్లిపోయారు. మూడో రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement