ధర్మవరంలో పోలీసుల అరాచకం | Target ysrcp activists | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో పోలీసుల అరాచకం

Aug 30 2016 12:21 AM | Updated on Apr 3 2019 8:52 PM

ధర్మవరంలో పోలీసుల అరాచకం - Sakshi

ధర్మవరంలో పోలీసుల అరాచకం

ధర్మవరంలో పోలీసులు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు. అధికాపార్టీ నేతల మెప్పు పొందేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి చావబాదుతున్నారు.

 
  •  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు టార్గెట్
  •  స్టేషన్‌కు పిలిచి చావబాదిన వైనం
  • ఆస్పత్రిలో చేరిన బాధితులు
అనంతపురం సెంట్రల్‌ : ధర్మవరంలో పోలీసులు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు. అధికాపార్టీ నేతల మెప్పు పొందేందుకు  ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి చావబాదుతున్నారు.  బాధితులు సోమవారం తెలిపిన మేరకు... వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్‌’ పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న అధికార పార్టీ నేతలు సీఐ హరినాథ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తమపై కక్షసాధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు, కౌన్సిలర్‌ ఉమాదేవి భర్త రవీంద్రప్రసాద్‌ వాపోయారు. పని ఉందని స్టేషన్‌కు పిలిపించి చావబాదుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని కౌన్సిలర్‌ ఉమాదేవి ప్రశ్నించారు. తన భర్తకు పోలీసుల నుంచే ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. తనకు, తన భర్తకు రక్షణ కల్పించాలని కోరారు. అకారణంగా తనను కూడా చావగొట్టారని మరో బాధితుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఈశ్వరయ్య విలపించాడు. అధికారపార్టీ నాయకుల మెప్పు పొందేందుకు ఈ విధంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం మొత్తం 15 మందిని స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో కౌన్సిలింగ్‌ నిర్వహించారని బాధితులు పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement