తాలూకా పోలీస్‌స్టేషన్‌ వార్షిక తనిఖీ | taluka police station yearly visit | Sakshi
Sakshi News home page

తాలూకా పోలీస్‌స్టేషన్‌ వార్షిక తనిఖీ

Dec 7 2016 12:13 AM | Updated on Aug 21 2018 9:20 PM

ఎస్పీ ఆకే రవికృష్ణ మంగళవారం మధ్యాహ్నం కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ స్టేషన్‌కు చేరుకోగానే సిబ్బంది ముందుగా గౌరవ వందనం చేశారు.

 కర్నూలు :   ఎస్పీ ఆకే రవికృష్ణ మంగళవారం మధ్యాహ్నం కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ స్టేషన్‌కు చేరుకోగానే సిబ్బంది ముందుగా గౌరవ వందనం చేశారు. అనంతరం సర్కిల్‌ కార్యాలయంలో కూర్చోని రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారని సీఐ మహేశ్వర్‌రెడ్డితో పాటు ఎస్‌ఐలను అభినందించారు. లాకప్‌ గదులను శుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement