'ముద్రగడతో మరోదఫా చర్చలు జరుపుతాం' | Talks with mudragada padmanabham, says n chinna rajappa | Sakshi
Sakshi News home page

'ముద్రగడతో మరోదఫా చర్చలు జరుపుతాం'

Jun 15 2016 12:06 PM | Updated on Sep 4 2017 2:33 AM

కాపు సామాజిక వర్గం నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో మరోదఫా చర్చలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప వెల్లడించారు.

విజయవాడ : కాపు సామాజిక వర్గం నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో మరోదఫా చర్చలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప వెల్లడించారు. ముద్రగడ ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలసి చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు.

కేసుల విషయంలో చట్టానికి లోబడే పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ముద్రగడకు అత్యవసర వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కామినేని శ్రీనివాస్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement