ఆస్పత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరం | swatch hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరం

Nov 5 2016 11:33 PM | Updated on Mar 28 2019 5:32 PM

ఆస్పత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరం - Sakshi

ఆస్పత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరం

ఆస్పత్రుల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉన్నప్పుడు రోగి ప్రశాంతంగా చికిత్స పొందే అవకాశం ఉంటుందని, అందుకు ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీ హంస) రాష్ట్ర అధ్యక్షులు యోగేశ్వరరెడ్డి అన్నారు.

విజయవాడ (లబ్బీపేట) : ఆస్పత్రుల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉన్నప్పుడు రోగి ప్రశాంతంగా చికిత్స పొందే అవకాశం ఉంటుందని, అందుకు ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీ హంస) రాష్ట్ర అధ్యక్షులు యోగేశ్వరరెడ్డి అన్నారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం  స్వచ్ఛ్‌ ఆస్పత్రి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం. జగన్మోçßæనరావు మాట్లాడుతూ ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి. రవికుమార్, డెప్యూటీ రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నరసింహనాయక్, మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాధవి, అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ అరవ పాల్, ఉపాధ్యక్షులు కొండపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా, సిటీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement