వరంగల్ జిల్లా కేసముద్రంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
వరంగల్ జిల్లా కేసముద్రంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనకు పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. బెజ్జం రంజిత్(28) వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం స్నేహితులతో కలిసి గుంజేడులో జరిగే జాతరకు వెళ్లాడు. సాయంత్రం అంతా కలసి తిరుగు పయనమయ్యారు. ఆ క్రమంలో వారిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగించారు.
అయితే, మద్యం మత్తులో ఉన్న రంజిత్ పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని నర్సంపేట ఆస్పత్రికి తీసుకె ళ్లి ఆల్కహాల్ పరీక్ష చేయించబోగా అతడు వాదులాటకు దిగాడు. ఈ క్రమంలోనే ముక్కు నుంచి రక్తస్రావం కావటంతో తీవ్ర అస్వస్థతకు గురై అర్థరాత్రి చనిపోయాడు.ఈ సమాచారం అందుకున్న బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులే అతడిని కొట్టి చంపారని ఆరోపిస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయ్నతించారు.