ఆర్టీసీ కండక్టర్‌కు వడదెబ్బ | sun stroke of rtc conductor | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కండక్టర్‌కు వడదెబ్బ

Apr 1 2017 11:27 PM | Updated on Sep 5 2017 7:41 AM

పెనుకొండ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేసే సువర్ణబాయి శనివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురయ్యారు.

పెనుకొండ : పెనుకొండ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేసే సువర్ణబాయి శనివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురయ్యారు. పెనుకొండ - కదిరి మధ్య తిరిగే బస్సులో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయమే పెనుకొండ నుంచి కదిరికి చేరుకున్న బస్సు తిరిగి పెనుకొండకు తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలోనే ఆమె ఎండ తీవ్రతకు వడదెబ్బ బారిన పడి పడిపోయారు. తోటి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తరువాత అదే బస్సులో పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, సెలైన్‌ బాటిళ్లు ఎక్కించి చికిత్స ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement