రుణాలు గోవిందా!

రుణాలు గోవిందా!


లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో

అప్‌లోడ్ చేయడంలో ఆలస్యం

వైబ్‌సైట్‌ను మూసివేసిన సర్కారు

ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం

మంజూరుకు నోచుకోని రూ. 2 లక్షలపై విలువ యూనిట్‌లు

271 మంది లబ్ధిదారులకు మొండిచేరుు

వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించాలి : ఉన్నతాధికారులు


 ఇందూరు :  రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తున్న నేపథ్యంలో 2015-16 సంవత్సరానికి నాలుగు నెలల క్రితం మండల, మున్సిపల్ కార్యాలయాల్లో భారీ సం ఖ్యలో రుణాల కోసం దరఖాస్తులు వచ్చారుు. ప్రధానంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు యూ నిట్‌ల కోసం ఒక్క రుణానికి ఇద్దరు చొప్పున పోటీ పడ్డారు. అయితే తొలుత మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ఎంపిక చేసి మార్చి 28న కలెక్టర్ కార్యాలయంలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో 212 మంది, బీసీ కార్పొరేషన్‌లో 59 మంది, మొత్తం కలిపి 271 మందిని ఎంపిక చేశారు.


జాబితాను కూడా ప్రకటించారు. అనంతరం కలెక్టర్ తో కాగితాలపై అప్రూవల్ చేయించిన ఎస్సీ, బీసీ కా ర్పొరేషన్ అధికారులు ప్రభుత్వం రుణాలు మం జూ రు చేసేందుకు ఏర్పాటు చేసిన (ఆన్‌లైన్ మం జూ రుకు సంబంధించిన) వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల వివరా లు నమోదు చేయడం జాప్యం చేశారు. అయితే ప్రభుత్వం ఏప్రిల్ 21న వెబ్‌సైట్‌ను క్లోజ్ చే సింది. ఉన్నతాధికారులు వెబ్‌సైట్‌ను ప్రభుత్వం తెరి స్తేగాని రుణాల మంజూరు సాధ్యపడదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏం చెయ్యాలో అర్థం కాక, రుణాలు మంజూరు కాకపోతే లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.


 నిర్లక్ష్యానికి పరాకాష్ఠ

రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో రుణాలకు రాయితీ ఇస్తున్నందుకు పోటీ పెరిగింది. అర్హులను గుర్తించడానికి అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేసి ఎంపిక పక్రియ పూర్తి చేశారు. కానీ ఆ తరువాత కా ర్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆన్‌లైన్ మం జూరుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వెంట వెంటనే వివరాలు అప్‌లోడ్ చేయడంలో జాప్యం చేశారు.


ఒక పక్క కలెక్టర్ యోగితారాణా పారదర్శకంగా రుణాలు అర్హులకు అందించడానికి చర్యలు చేపడితే, మరో పక్క అధికారులు జాప్యాన్ని ప్రదర్శిం చి రుణాలకు ఎసరు తెచ్చారు. అదేవిధంగా రుణాలను అందించడానికి సంబంధిత శాఖల అధికారులు భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ.. ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌లకు కొంత కాలంగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వేరే శాఖలకు చెందిన అధికారు లు ఇన్‌చార్జీలుగా పని చేస్తున్నారు. ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.


 వెబ్‌సైట్ తెరిస్తేనే ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ మంజూరు వెబ్‌సైట్‌ను మళ్లీ తెరిచే అవకాశాలు కనపించడం లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆశలు కలుగుతున్నాయి. అదేంటంటే నిజామాబాద్ జిల్లాతోపా టు కరీంనగర్,ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇదే విధంగా జరిగింది.


  లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్ మంజూరు కోసం అప్‌లోడ్ చేయలేదు. నాలుగు జిల్లాల ఉన్నతాధికారు లు కలిసి సర్కారుపై ఒత్తిడి తెస్తే వెబ్‌సైట్‌ను తిరిగి పునఃప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ల అధికారులు తమ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల అధికారులకు, ప్రభుత్వానికి లేఖల ద్వారా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఇంత వరకు వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top