విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలి | students to sucess selected field | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలి

Aug 5 2016 11:19 PM | Updated on Oct 2 2018 6:42 PM

విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలి - Sakshi

విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలి

కనగల్‌ : విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కోఆర్డినేటర్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.

కనగల్‌ : విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కోఆర్డినేటర్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం చర్లగౌరారం పరిధిలోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతి«థిగా హాజరై మాట్లాడారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన కలిగి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం కళాశాల వైస్‌ చైర్మన్‌ ఎంసీ కోటిరెడ్డి, కళాశాల డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మూల దయాకర్‌రెడ్డి, యానాల ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ స్వామి రామానంద తీర్థ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో అభ్యసించిన విద్యార్థులు దేశవిదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. అంతకుముందు జేఎన్‌టీయూ కోఆర్డినేటర్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ బి.హరినాథరెడ్డి, హెచ్‌ఓడీలు గిరీశ్‌రెడ్డి, హైమావతి, టి.మధు, శశిదర్‌రెడ్డి, శ్రీనివాస్‌కుమార్, ధర్మ, భార్గవ్‌కుమార్, టీపీఓ, శ్రీనివాస్, రవికుమార్, రాజారాంరెడ్డి, బాబా నసీరోద్దీన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement