నీరు తాగి 30 మంది విద్యార్థినులకు అస్వస్థత | Students ill health contaminated drinking water | Sakshi
Sakshi News home page

నీరు తాగి 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

Aug 7 2015 11:42 AM | Updated on Mar 19 2019 9:15 PM

కలుషిత మంచి నీరు తాగి సుమారు 30 బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కర్నూలు : కలుషిత మంచి నీరు తాగి సుమారు 30 బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం కర్నూలు జిల్లా హోలగుంద మండలం కేంద్రంలోని కస్తుర్బా బాలికల విద్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు ... మండల కేంద్రంలోని కస్తుర్బా బాలిక విద్యాలయంలో తాగునీటి కొరత ఉంది.

దీంతో తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీరు యాజమాన్యం ట్యాంకుల ద్వారా విద్యార్థులకు అందజేస్తున్నారు. అయితే, ఈ నీటిని శుద్ధి చేయకపోవడంతో 30 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో విద్యార్థులందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలిసిన   ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement