ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మాదాసి వాణి(17) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో గాలించి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నస్‌పూర్‌లోని బంధువుల ఇంట్లో ఉన్న వాణిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లోని ఉరేసుకుంది. తల్లి మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.