తల్లి మందలించిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రాఘవపట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొలగాని కళావతి, జలపతి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
Sep 17 2016 10:41 PM | Updated on Nov 9 2018 5:02 PM
గొల్లపల్లి : తల్లి మందలించిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రాఘవపట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొలగాని కళావతి, జలపతి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో భాగ్యశ్రీ(19) డిగ్రీ వరకు చదువకుని కాలేజీ మానేసింది. ఏడాదిగా ఇంటి వద్దే ఉంటూ బీడీలు చేస్తోంది. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. బలపాలు తినే అలవాటు ఉండడంతో రక్తహీనత వ్యాధి నయం కావడంలేదని తల్లిదండ్రులు తరచూ మందలిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై ఉపేంద్రాచారి కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement