విద్యార్థినిపై అత్యాచారయత్నం | Student molest | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై అత్యాచారయత్నం

Mar 16 2017 12:17 AM | Updated on Nov 9 2018 5:02 PM

విద్యార్థినిపై అత్యాచారయత్నం - Sakshi

విద్యార్థినిపై అత్యాచారయత్నం

విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాధవరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని శివారులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.

మంత్రాలయం రూరల్‌(మంత్రాలయం):  విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాధవరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని శివారులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం పరీక్ష ఉండటంతో ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుంటూ బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే ఆదోని వైపు (ఏపీ21టీడబ్ల్యూ 5059) ఆటో వెళ్తుండగా పాఠశాల దగ్గర వదలాలని కోరింది.  మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్‌ నాగరాజు..విద్యార్థినిని ఆటోలో ఎక్కించుకుని కొంత దూరం వెళ్లగానే బాలికపై చెయ్యి వేశాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని ఒక్కసారిగా ఆటోలో నుంచి కిందకు దూకింది. దీంతో ఆ విద్యార్థినికి గాయాలయ్యాయి. ముందుగా వెళ్తున్న విద్యార్థులు గమనించి వెంటనే విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకు వెళ్లారు. బాధితురాలిని.. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని మంత్రాలయం సీఐ నాగేశ్వర రావు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement