భర్తను చితకబాది భార్యపై అఘాయిత్యం | Miscreants Molestation On Womon At Velugodu In Kurnool | Sakshi
Sakshi News home page

భర్త కళ్ల ముందే భార్యపై లైంగిక దాడి

Aug 3 2020 4:40 PM | Updated on Aug 3 2020 5:30 PM

Miscreants Molestation On Womon At Velugodu In Kurnool - Sakshi

భర్తను లాక్కెళ్లిన నలుగురు దుండగులు అతన్ని చితకబాదారు. అతని ఎదుటే భార్యపై అఘాయిత్యం చేశారు.

సాక్షి, కర్నూలు: జిల్లాలోని వెలుగోడు మండలం జమ్మినగర్ తండాలో దారుణం జరిగింది. కొందరు దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తను లాక్కెళ్లిన నలుగురు దుండగులు అతన్ని చితకబాదారు. అతని ఎదుటే భార్యపై అఘాయిత్యం చేశారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపించారు. గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు వెలుగోడు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
(చదవండి: ఇద్దరు మైనర్లపై 11 మంది గ్యాంగ్‌ రేప్‌)

ఘటనపై మహిళా కమిషన్‌ ఆరా
వెలుగోడు మండలం జిమ్మినగర్‌ తండాలో జరిగిన మహిళపై దుండగుల సామూహిక అత్యాచారం ఘటనపై  రాష్ట్ర మహిళా కమీషన్ ఆరా తీసింది. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మహిళా కమిషన్‌  ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement