సామూహిక అత్యాచారం.. ఆపై నోట్లో గడ్డిమందు పోసి

Girl Was Molested By Three Youths At Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: దేవనకొండ మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక(15)పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత  నోట్లో గడ్డి మందు పోసి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆ బాలిక బనవాసి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం వేరుశనగ పంటను తెంచేందుకు పొలానికి వెళ్లారు.

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి పక్కన ఉండే ఓ బాలుడు గమనించి గట్టిగా అరిచాడు. దీంతో ఆ యువకులు అమ్మాయి నోట్లో గడ్డి మందును పోసి.. ఇంటి వెనకవైపు నుంచి పరారయ్యారు. తల్లిదండ్రులు ఇంటికొచ్చిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గమనించి వెంటనే కోడుమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.  (ప్రాణభయంతో కేకలు.. ఆరుగుర్ని కాపాడిన ఎస్‌ఐ) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top