పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన వసంతాడ రేష్మి అలియాస్ తుషారి (10) జ్వరంతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుమూసింది. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
జ్వరంతో విద్యార్థిని కన్నుమూత
Jul 21 2016 11:01 PM | Updated on Sep 4 2017 5:41 AM
పార్వతీపురం : పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన వసంతాడ రేష్మి అలియాస్ తుషారి (10) జ్వరంతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుమూసింది. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వివేకానంద కాలనీకి చెందిన కార్పెంటర్ వసంతాడ శ్రీనివాసరావు, వరలక్ష్మిలకు ముగ్గురు ఆడపిల్లలు. రెండో పాప రేష్మి స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఉన్నట్టుండి బుధవారం ఉదయం తీవ్ర జ్వరం వచ్చింది. వెంటనే స్థానిక చిన్న పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా ఆయన పరీక్షించి విజయనగరంలోని ఆంధ్రా చిల్డ్రన్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పాపను పరీక్షించి విశాఖకు తరలించమని సూచించారు. ఇంతలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
Advertisement


