కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణంలోని బస్టాండు వద్ద బుధవారం ఉదయం విద్యుదాఘాతంతో లారెన్స్(15) అనే విద్యార్థి మృతిచెందాడు.
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణంలోని బస్టాండు వద్ద బుధవారం ఉదయం విద్యుదాఘాతంతో లారెన్స్(15) అనే విద్యార్థి మృతిచెందాడు. భవన నిర్మాణ పనులకు వెళ్లిన లారెన్స్ ఇనుప కడ్డీలు తీసుకెళుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. లారెన్స్ ఇటీవలే పదోతరగతి పూర్తిచేశాడు. కొద్ది రోజుల క్రితమే లారెన్స్ తండ్రి మృతి చెందగా.. ఇప్పుడు ఆసరాగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో లారెన్స్ తల్లి చెట్టెమ్మ రోదనలు మిన్నంటాయి.