హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి | student dead | Sakshi
Sakshi News home page

హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

Oct 27 2016 11:38 PM | Updated on Nov 9 2018 4:36 PM

రాజోలు గురుకుల కళాశాల ఇంటర్మీడియేట్‌ ఫస్టియర్‌ విద్యార్థిని గోడ రాణి (17) గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. స్టడీ అవర్‌ కోసం విద్యార్థినులంతా నిద్రలేచినప్పటికీ రాణి నిద్ర లేవలేదు. దీంతో తోటి విద్యార్థినులు కోట ప్రశాంతి , గురజ శిరీషలు కంగారుపడి అటెండర్‌ ఇంజేటి వరలక్షి్మకి సమాచారం అందించారు. వారంతా రాణిని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌ సర్వూప్‌ విద్యార్థిని రాణ

  • గుండెపోటు కారణమంటున్న వైద్యుడు l
  • ఒత్తిడి వల్లే చనిపోయిందంటున్న ప్రజా సంఘాలు
  • రాజోలు : 
    రాజోలు గురుకుల కళాశాల ఇంటర్మీడియేట్‌ ఫస్టియర్‌ విద్యార్థిని గోడ రాణి (17) గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. స్టడీ అవర్‌ కోసం విద్యార్థినులంతా నిద్రలేచినప్పటికీ రాణి నిద్ర లేవలేదు. దీంతో తోటి విద్యార్థినులు కోట ప్రశాంతి , గురజ శిరీషలు కంగారుపడి అటెండర్‌ ఇంజేటి వరలక్షి్మకి సమాచారం అందించారు. వారంతా రాణిని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌ సర్వూప్‌ విద్యార్థిని రాణి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటు కారణమని అభిప్రాయపడ్డారు. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ మత్తి జ్యోత్స్న సుజ్ఞానవల్లి మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాజోలు సీఐ క్రిషో్టఫర్‌ తెలిపారు.రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 
     
    నాలుగు రోజుల క్రితమే ఇంటికి.. 
    నాలుగు రోజుల క్రితమే రాణి ఇంటికి వచ్చిందని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు భోరున విలపించాడు. ఆస్పత్రి వద్ద ఉన్న కుమార్తె మృతదేహం వద్ద కుçప్పకూలిపోయాడు. కుమార్తెను కళాశాలలో చేర్పించాక తన భార్య ధనలక్ష్మి ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిందని, భార్యకు ఏం సమాధానం చెప్పాలంటూ విలపించాడు. వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు ఏసీ మెకానిక్, చిన్న కుమారుడు ఐదో తరగతి చదువుతున్నాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement