ఒత్తిడి లేని మనస్సు.. రోగంలేని శరీరం యోగాతో సాధ్యమని ఏపీఎస్‌పీ రెండో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్ అన్నారు.
యోగాతో ఒత్తిడి దూరం
Jan 11 2017 12:41 AM | Updated on Aug 20 2018 3:37 PM
	– ఏపీఎస్‌పీ అసిస్టెంట్ కమాండెంట్ 
	 
					
					
					
					
						
					          			
						
				
	కర్నూలు: ఒత్తిడి లేని మనస్సు.. రోగంలేని శరీరం యోగాతో సాధ్యమని ఏపీఎస్‌పీ రెండో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్ అన్నారు. బెంగళూరులో ఈనెల 6,7,8 తేదీల్లో జరిగిన యోగా మహోత్సవం పోటీల్లో భాగంగా స్థానిక యోగా గురువైన మహమ్మద్‌గౌస్ పాల్గొని గోల్డ్‌మెడల్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ఏపీఎస్‌పీ క్యాంపులో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా శశికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్‌గౌస్ యోగా ద్వారా కర్నూలుకు జాతీయ స్థాయిలో  గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని యోగా సాధన చేయాలని సూచించారు. అవార్డు గ్రహీత గౌస్ మాట్లాడుతూ   తన జీవితాన్ని యోగాకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. యోగా టీచర్లంతా కలిసి గురువు గౌస్‌ను సన్మానించారు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
