పెట్రోల్ తక్కువ పోస్తున్నారని గొడవ | Stir for less petrol in subhash nagar | Sakshi
Sakshi News home page

పెట్రోల్ తక్కువ పోస్తున్నారని గొడవ

Aug 25 2016 10:21 PM | Updated on Sep 4 2017 10:52 AM

వాహనదారుడితో పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది వాగ్వాదం, ఘర్షణ

వాహనదారుడితో పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది వాగ్వాదం, ఘర్షణ

బంక్‌లో రీడింగ్‌ కంటే తక్కువ పెట్రోల్‌ పోస్తున్నారని సిబ్బందితో మరోసారి గొడవకు దిగారు.

సుభాష్‌నగర్‌: జీడిమెట్ల డిపో సమీపంలో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో టాటా మోటార్స్‌ ఉద్యోగి రాజేష్‌ గురువారం ఉదయం 9.30కి రూ.30  పెట్రోల్‌ పోయించుకున్నాడు. 50 మీటర్ల దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది. ఎంతకీ స్టార్ట్‌ కాకపోవడంతో మెకానిక్‌ వద్దకు వెళ్లగా ట్యాంక్‌లో ఒక్క చుక్క కూడా పెట్రోల్‌ లేదని చెప్పాడు.

దీంతో రాజేష్‌ సదరు పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది నిలదీయగా... ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాజేష్‌కు చెందిన రూ.25 వేల సెల్‌ఫోన్‌ ధ్వంసమైంది. ఇంతలోనే మరో ఇద్దరు యువకులు ఈ పెట్రోల్‌ బంక్‌లో రీడింగ్‌ కంటే తక్కువ పెట్రోల్‌ పోస్తున్నారని సిబ్బందితో మరోసారి గొడవకు దిగారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకోవడంతో జీడిమెట్ల పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement