రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల ఈత మొక్కలు | statewise 45lakhs swim plants | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల ఈత మొక్కలు

Jul 23 2016 10:58 PM | Updated on Sep 4 2017 5:54 AM

రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల ఈత మొక్కలు

రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల ఈత మొక్కలు

హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఈత మొక్కలను నాటనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా తెలిపారు.

చిట్యాల: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఈత మొక్కలను నాటనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ శివారులో శనివారం ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జీవన్‌సింగ్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ దత్తురాజ్‌గౌడ్, సీఐ నర్సిరెడ్డి, ఎంపీడీఓ బి.లాజర్, తహసీల్దార్‌ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement