అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు మామిడికుదురు నవయువ క్రీడా యువజన సేవా సంఘంలో శిక్షణ పొందుతున్న ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ బొంతు మధుకుమార్ గురువారం తెలిపారు. రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన సెలక్షన్స్‌లో వీరి ఎంపిక జరిగిందన్నారు. 54–57 కిలోల విభాగంలో పి.జ్యోతి, 51–54 కిలోల విభాగంలో కె.సాయిపవన్ ఎంపికయ్యారని చెప్పారు.
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఇద్దరి ఎంపిక
Published Thu, Sep 15 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
మామిడికుదురు :
అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు మామిడికుదురు నవయువ క్రీడా యువజన సేవా సంఘంలో శిక్షణ పొందుతున్న ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ బొంతు మధుకుమార్ గురువారం తెలిపారు. రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన సెలక్షన్స్‌లో వీరి ఎంపిక జరిగిందన్నారు. 54–57 కిలోల విభాగంలో పి.జ్యోతి, 51–54 కిలోల విభాగంలో కె.సాయిపవన్ ఎంపికయ్యారని చెప్పారు. జ్యోతి పి.గన్నవరం సిద్ధార్థ జూనియర్ కళాశాలలో, సాయిపవన్ పేరూరు శ్రీవంశీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారని చెప్పారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ విద్యార్థులకు బాక్సింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని మధుకుమార్ చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.తాతబ్బాయి, కోచ్ మధుకుమార్, తదితరులు అభినందించారు.
Advertisement
Advertisement