గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఆధ్వర్యంలో స్టాంప్ డిజైన్ పోటీలు నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిపబ్లిక్‌డేకు స్టాంప్ డిజైన్ పోటీలు
Dec 14 2016 12:01 AM | Updated on Sep 18 2018 8:18 PM
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఆధ్వర్యంలో స్టాంప్ డిజైన్ పోటీలు నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏ4 సైజు పేపర్‌పై డిజైన్ చేసి ఆ కాగితం వెనుక పేరు, వయస్సు, లింగం, జాతీయత, పిన్‌కోడ్‌తో సహా పూర్తి చిరునామా, ఫోన్ నంబర్, (ఉంటే) ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎంట్రీలను ఈనెల 20లోపు 'ఏడీజీ–1 (ఫిలాటలీ), రూమ్ నంబర్ 108(బి), డాక్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ–110001' చిరునామాకు స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలన్నారు. ఎంపికైన మొదటి ముగ్గురు విజేతలకు రూ.10,000, రూ.6,000, రూ.4,000 చొప్పున బహుమతులు ఉంటాయన్నారు.
Advertisement
Advertisement