breaking news
Stamp Design
-
రిపబ్లిక్‌డేకు స్టాంప్ డిజైన్ పోటీలు
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఆధ్వర్యంలో స్టాంప్ డిజైన్ పోటీలు నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏ4 సైజు పేపర్‌పై డిజైన్ చేసి ఆ కాగితం వెనుక పేరు, వయస్సు, లింగం, జాతీయత, పిన్‌కోడ్‌తో సహా పూర్తి చిరునామా, ఫోన్ నంబర్, (ఉంటే) ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎంట్రీలను ఈనెల 20లోపు 'ఏడీజీ–1 (ఫిలాటలీ), రూమ్ నంబర్ 108(బి), డాక్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ–110001' చిరునామాకు స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలన్నారు. ఎంపికైన మొదటి ముగ్గురు విజేతలకు రూ.10,000, రూ.6,000, రూ.4,000 చొప్పున బహుమతులు ఉంటాయన్నారు. -
తపాలాశాఖ స్టాంపు డిజైన్ పోటీలు
తెనాలి : తపాలశాఖ అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో స్టాంపు డిజైను పోటీలను నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘స్వచ్ఛభారత్’ అనే అంశంపై నిర్వహించే ఈ పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను ‘అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఫిలా టెలి), రూమ్ నం.108 (బి), ఢాక్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ –110001 చిరునామాకు, స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ నెల 22వ తేదీకి చేరేలా పంపాలని కోరారు.