పెనుకొండ రూరల్ : మండలంలోని గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న సుమలత సోమవారం విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తాను 6 నెలల గర్భిణిని అని, కాలు ఫ్రాక్చర్ అయినా 3 రోజుల నుంచి రాత్రీ, పగలు డ్యూటీ చేయిస్తున్నారని చెప్పింది. సోమవారం సెలవు అడిగానని, కానీ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది విషపుగుళికలు మింగినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.