అనుమానంతో భార్యను కడతేర్చాడు.. | srinivasarao accused in wife murder case | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను కడతేర్చాడు..

Oct 1 2015 10:02 PM | Updated on Aug 11 2018 8:15 PM

అనుమానంతో భార్యను కడతేర్చాడు.. - Sakshi

అనుమానంతో భార్యను కడతేర్చాడు..

గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

తెనాలి రూరల్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్య గొంతు నులిమి చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన గమిడి శ్రీనివాసరావు మొదటి భార్య మృతి చెందగా, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా వదిలి వెల్లడంతో మూడేళ్ల క్రితం గ్రామానికే చెందిన పూర్ణ(30)ను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెను అనుమానిస్తూ తరచూ వేధిస్తున్నప్పటికీ భరిస్తూ వచ్చింది.

గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న భార్య గొంతు నులిమి మంచంపై ఆమె మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. హడావిడిగా వెళ్లిపోతున్న శ్రీనివాసరావును గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా, పూర్ణ విగతజీవురాలై పడి ఉంది. దీంతోవారు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసరావు భార్య గొంతు నులిమి హత్య చేశాడని భావిస్తున్నట్టు సీఐ రవిచంద్ర తెలిపారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement