breaking news
husband srinivasarao
-
అనుమానంతో భార్యను కడతేర్చాడు..
తెనాలి రూరల్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్య గొంతు నులిమి చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన గమిడి శ్రీనివాసరావు మొదటి భార్య మృతి చెందగా, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా వదిలి వెల్లడంతో మూడేళ్ల క్రితం గ్రామానికే చెందిన పూర్ణ(30)ను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెను అనుమానిస్తూ తరచూ వేధిస్తున్నప్పటికీ భరిస్తూ వచ్చింది. గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న భార్య గొంతు నులిమి మంచంపై ఆమె మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. హడావిడిగా వెళ్లిపోతున్న శ్రీనివాసరావును గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా, పూర్ణ విగతజీవురాలై పడి ఉంది. దీంతోవారు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసరావు భార్య గొంతు నులిమి హత్య చేశాడని భావిస్తున్నట్టు సీఐ రవిచంద్ర తెలిపారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
తగరపువలస(విశాఖపట్టణం): విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలం టీనగరపాలెం గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు, సునీత(25) దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాది, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు కూతుళ్లున్నారు. బుధవారం సాయత్రం వారు ఉండే భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిందని భర్త శ్రీనివాసరావు చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం శ్రీనివాసరావుపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.