శ్రీగంధం చెట్ల నరికివేత | sree gandham trees cutting | Sakshi
Sakshi News home page

శ్రీగంధం చెట్ల నరికివేత

Jan 19 2017 11:57 PM | Updated on Sep 5 2017 1:37 AM

కుందుర్పి మండలం జంబుగుంపల అటవీ ప్రాంతంలోని నడుంబీడు, మారెమ్మకొండ, బోరప్ప కనుమ ప్రాంతాల్లోని శ్రీగంధం చెట్లను కొందరు దుండగులు రాత్రికి రాత్రే నరికివేస్తున్నారని ఆయా గ్రామస్తుల ఆరోపించారు.

కుందుర్పి(కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం జంబుగుంపల అటవీ ప్రాంతంలోని నడుంబీడు, మారెమ్మకొండ, బోరప్ప కనుమ ప్రాంతాల్లోని శ్రీగంధం చెట్లను కొందరు దుండగులు రాత్రికి రాత్రే నరికివేస్తున్నారని ఆయా గ్రామస్తుల ఆరోపించారు. పైన పేర్కొన్న ప్రాంతాల్లో సుమారు 7 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న జంబుగుంపల అటవీ ప్రాంతానికి ఆరు నెలలుగా సిబ్బంది లేకపోవడంతో టేకు, వెదురుతో పాటు విలువైన శ్రీగంధం చెట్టను రంపాలతో కోసి తరలిస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మడకశి, కుందుర్పి, పావగడ, కుందుర్పి తదితర ప్రాంతాలకు చెందిన వారి హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement