పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ | sp observed pushkar ghats | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ

Jul 21 2016 11:36 PM | Updated on Sep 4 2017 5:41 AM

మండల కేంద్రంలోని వాగులో, దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్‌ పనులను గురువారం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు.

కనగల్‌ : మండల కేంద్రంలోని వాగులో, దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్‌ పనులను గురువారం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్‌ సమస్య తెల్తెకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ ఎంట నల్లగొండ డీఎస్సీ సుధాకర్, చండూర్‌ సీఐ రమేశ్‌కుమార్, కనగల్‌ ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement