దొనకొండ మండల ఇండ్ల చెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.
దొనకొండ(ప్రకాశం జిల్లా): దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాదం వీర వెంకట్రామయ్య(15) అనే బాలుడు ఊరికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు తెలియజేశారు.