గణపతీ.. ఇదేమి దుస్థితి | So sad... ganapati | Sakshi
Sakshi News home page

గణపతీ.. ఇదేమి దుస్థితి

Sep 19 2016 12:33 AM | Updated on Oct 20 2018 4:29 PM

గణపతీ.. ఇదేమి దుస్థితి - Sakshi

గణపతీ.. ఇదేమి దుస్థితి

ఇవి ఇప్పటికే నవరాత్రుల పాటు పూజలందుకున్న విగ్రహాలే. లింగాల ఘణపురం మండల కేంద్రంలోని చెరువులో నీళ్లు లేక ఇలా మట్టిలోనే వదిలేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా ఇక్కడ మాత్రం చుక్కనీరు పడలేదు.

  • నిమజ్జనానికి నీరు కరువు
  • మూడేళ్లుగా ఇదే పరిస్థితి
  • గంగమ్మ కోసం గ్రామస్తుల ఎదురుచూపు
  • ఈ వి‘చిత్రం’ చూశారా..!  ఈ విగ్రహాలను చూస్తుంటే వినాయక చవితి ఉత్సవాల కోసం తయారు చేసి అమ్మకం కోసం పెట్టినట్టు కనిపిస్తోంది కదూ.. కానీ ఇది నిజం కాదు. ఇవి ఇప్పటికే నవరాత్రుల పాటు పూజలందుకున్న విగ్రహాలే. లింగాల ఘణపురం మండల కేంద్రంలోని చెరువులో నీళ్లు లేక ఇలా మట్టిలోనే వదిలేశారు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా ఇక్కడ మాత్రం చుక్కనీరు పడలేదు. ఈ ఒక్క ఏడాదే కాదు.. గత మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎటూ చూసిన కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో సైతం ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో వీధివీధినా ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహాలను ఇలా చెరువులో వదిలేసిన భక్తులు గంగమ్మ కోసం ఎదురుచూస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement