భయంతో బస్సులో నుంచి దూకేశారు.. | smoke from rajadhani travels Bus in nandigama | Sakshi
Sakshi News home page

భయంతో బస్సులో నుంచి దూకేశారు..

Oct 29 2016 8:29 AM | Updated on Apr 7 2019 3:24 PM

భయంతో బస్సులో నుంచి దూకేశారు.. - Sakshi

భయంతో బస్సులో నుంచి దూకేశారు..

ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకేశారు.

నందిగామ: ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకేశారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నందిగామ బైపాస్ రోడ్డుపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రాజధాని ట్రావెల్స్ బస్సు నందిగామ వద్దకు చేరుకోగానే ఏసీలో నుంచి గాలికి బదులు పొగలు వచ్చాయి.

దీంతో బస్సు మొత్తం పొగతో నిండిపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగ లగొట్టుకొని బయటకు దూకారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement