ప్రజా సాధికారిక సర్వేలో రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తగదని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మండిపడ్డారు.
స్మార్ట్ పల్స్ సర్వేపై నిర్లక్ష్యం వద్దు
Jul 27 2016 4:44 PM | Updated on Sep 28 2018 7:36 PM
బుక్కరాయసముద్రం :
ప్రజా సాధికారిక సర్వేలో రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తగదని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మండిపడ్డారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సాధికారిక సర్వేలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సర్వర్ పని చేయలేదని కుంటిసాకులు చెప్పొద్దని జేసీ అధికారులకు హితవు పలికారు.
అదే విధంగా కొంత మంది సిబ్బంది వెబ్‌సైట్‌లో లాగిన్ కూడా కావడం లేదన్నారు. ప్రతి రోజూ సాయంత్రం డైలీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నా వాటిని అధికారులు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement