పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌కు షోకాజ్‌ | shocaz of puttaparthy muncipal chairman | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌కు షోకాజ్‌

Apr 15 2017 11:20 PM | Updated on Oct 16 2018 6:33 PM

పుట్టపర్తి మునిసిపల్‌ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత పీసీ గంగన్నకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శనివారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

అనంతపురం టౌన్‌ : పుట్టపర్తి మునిసిపల్‌ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత పీసీ గంగన్నకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శనివారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. కొంతకాలంగా మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఐదు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.  సంజాయిషీ ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement