బాల్యవివాహాలు చేస్తే శిక్ష తప్పదు | serious actions by child marriages | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు చేస్తే శిక్ష తప్పదు

Sep 27 2016 11:00 PM | Updated on Sep 4 2017 3:14 PM

బాల్యవివాహాలు చేయాలని చూస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష తప్పనిసరి అని తహశీల్దార్‌ రామకష్ణారెడ్డి,ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

కే.బ్రాహ్మణపల్లి (కదిరి అర్బన్‌) : బాల్యవివాహాలు చేయాలని చూస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష తప్పనిసరి అని తహశీల్దార్‌ రామకష్ణారెడ్డి,ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి  పేర్కొన్నారు. మండల పరిధిలోని కే. బ్రాహ్మణపల్లిలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో  ప్రజాసేవాసమాజ్‌ సహాకారంతో మంగళవారం బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 

పలువురు వక్తలు మాట్లాడుతూ  మండల పరిధిలోని దిగువపల్లి, మల్లయ్యగారిపల్లితండా, రెడ్డిపల్లితండా, ఎగుపల్లిగ్రామాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు అందిందన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.  ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098 నంబరుకు ఫోన్‌చేసి తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ చెన్నకష్ణ, ఐసీడీఎస్‌ పడమర సీడీపీఓ విజయకుమారి, పాఠశాల హెచ్‌ఎం నారాయణరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement