భానూ.. నా ముఖాన ఇంత బొట్టు పెట్టు | selfy video before women proffeser commits suicide in nellor district | Sakshi
Sakshi News home page

భానూ.. నా ముఖాన ఇంత బొట్టు పెట్టు

Feb 10 2016 3:35 AM | Updated on Nov 6 2018 7:56 PM

భానూ.. నా ముఖాన ఇంత బొట్టు పెట్టు - Sakshi

భానూ.. నా ముఖాన ఇంత బొట్టు పెట్టు

‘భానూ..ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా..నా చేతులకు గాజులు వేసి..నా ముఖాన ఇంత బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లయిపోయింది భానూ..

♦ సెల్ఫీ వీడియోలో స్నేహితుడికి చివరి విజ్ఞప్తి
♦ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్
 
 సాక్షి, నెల్లూరు: ‘భానూ..ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా..నా చేతులకు గాజులు వేసి..నా ముఖాన ఇంత  బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లయిపోయింది భానూ.. ఈ ఒకే ఒక్క కోరిక తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్‌లోకి..ఇంకెవరి లైఫ్‌లోకి రాను.. మీకందరికీ దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను.. ఇక సెలవ్..’ అంటూ వీడియో సెల్ఫీ తీసుకున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ బలవన్మరణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం నింపాయి. కావలిలోని కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన వీర మాధవి (28) పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో ఆమెకు నెల్లూరుకు చెందిన భానుతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో నగదు, నగలు, సర్వం అర్పించుకుంది. తర్వాత ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మనస్సులోని బాధనంతా సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక సోదరి జానకి మాధవికి చెందిన సెల్‌ఫోన్‌ను పరిశీలించడంతో సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడు భానుతేజను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement