గల్లంతైన బాలుడి కోసం గాలింపు | Search for missing boy | Sakshi
Sakshi News home page

గల్లంతైన బాలుడి కోసం గాలింపు

Nov 15 2016 10:48 PM | Updated on Sep 4 2017 8:10 PM

గల్లంతైన బాలుడి కోసం గాలింపు

గల్లంతైన బాలుడి కోసం గాలింపు

కేసీ కాలువలో సోమవారం గల్లంతైన బాలుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుమ్మరపల్లెకు చెందిన భజంత్రి నాగేంద్ర కుమారులు హరినాథ్‌(4), యశ్వంత్‌ (3) గట్టుపై సాయంత్రం ఆడుకుం టుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు.

కుమ్మరపల్లె(రాజుపాళెం): కేసీ కాలువలో సోమవారం గల్లంతైన బాలుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుమ్మరపల్లెకు చెందిన భజంత్రి నాగేంద్ర కుమారులు హరినాథ్‌(4), యశ్వంత్‌ (3) గట్టుపై సాయంత్రం ఆడుకుం టుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. యశ్వంత్‌ మృతదేహం పగిడాల సమీపంలో దొరికింది. హరినాథ్‌ అచూకీ ఇంత వరకు తెలియరాలేదు. చాపాడు కేసీ కాలువకు నీటిని నిలుపుదల చేసి గాలింపు చర్యలు చేపట్టినా కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. హరినా«థ్‌ ఆచూకీ తెలిస్తే రాజుపాళెం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యశ్వంత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరినాథ్, యశ్వంత్‌ అన్నదమ్ములు కావడంతో.. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక కుమారుడు మరణించడం, మరో కుమారుడి అచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం బంధువులకు కష్టతరంగా మారింది. గ్రామానికి సమీపంలోనే కేసీ కాలువ ఉండటంతో ఇరువైపులా రక్షణగా కంచెను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement