తాళం వేసిన ఇంట్లో చోరీ | Scene of the crime a locked house | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Sep 28 2016 10:56 PM | Updated on Sep 4 2017 3:24 PM

మండలంలోని దేవునిపల్లిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మిర్యాల్‌కర్‌ గణేశ్‌ సోమవారం ఇంటికి తాళం

  • లక్ష నగదు అపహరణ
  • కామారెడ్డి రూరల్‌ :
    మండలంలోని దేవునిపల్లిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మిర్యాల్‌కర్‌ గణేశ్‌ సోమవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌కు వెళ్లారు. దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగుల గొట్టి ఇంట్లో బీరువాను పగులగొట్టి లక్ష రూపాయలను దోచుకెళ్లారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్‌ నుంచి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడ్డట్లు గుర్తించారు. దీంతో గణేశ్‌ దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా క్లూస్‌ టీం వచ్చి దొంగల వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్‌ బుధవారం తెలిపారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement