వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు | scalarship under visshno community | Sakshi
Sakshi News home page

వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు

Sep 18 2016 10:29 PM | Updated on Sep 4 2017 2:01 PM

వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు

వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు

ప్రతిభ ఉన్న శ్రీవైష్ణవ విద్యార్థులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని శ్రీవైష్ణవ సంఘం నాయకులు కోరారు. ఆదివారం కోదాడలోని రంగనిగుడిలో జరిగిన సమావేశంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఉత్తమ ప్రతిభ చూపుతున్న శ్రీ వైష్ణవ విద్యార్థులకు సంఘం ఆధ్వర్యంలో ఉపకారవేతనాలను అందజేశారు.

కోదాడ: ప్రతిభ ఉన్న శ్రీవైష్ణవ విద్యార్థులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని శ్రీవైష్ణవ సంఘం నాయకులు కోరారు. ఆదివారం కోదాడలోని రంగనిగుడిలో జరిగిన సమావేశంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన  ఉత్తమ ప్రతిభ చూపుతున్న శ్రీ వైష్ణవ విద్యార్థులకు సంఘం ఆధ్వర్యంలో ఉపకారవేతనాలను అందజేశారు. పేదరికం ప్రతిభకు అడ్గుగా మారకూడదని,పేద విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారికి తగిన ప్రోత్సహాన్ని అందించడానికి శ్రీవైష్ణవ తెలంగాణ శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీవైష్ణవ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శృంగార తిరువెంగళాచార్యులు, కోదాడ శాఖ అధ్యక్షుడు చించాపట్టణం రజనీకాంతచార్యులు, కృష్ణమాచార్యులు, యాదగిరిచార్యులు, లక్ష్మణాచార్యులు, భరద్వాజ్, రాధాదేవి, వరదాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement