‘అమ్మను బతికించండి’ | save my mother want to ten lakhs for surgery | Sakshi
Sakshi News home page

‘అమ్మను బతికించండి’

Mar 26 2016 2:09 AM | Updated on Mar 28 2018 11:26 AM

క్లిష్టమైన జబ్బుతో బాధ పడుతున్న ఓ మహిళ...వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని దాతలను ఆర్థిస్తోంది.

ఉప్పల్: క్లిష్టమైన జబ్బుతో బాధ పడుతున్న ఓ మహిళ...వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని దాతలను ఆర్థిస్తోంది. దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించాల్సిన స్థితిలో తీవ్ర వేదనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే....వరంగల్ జిల్లా బొబ్బరోనిపల్లెకు చెందిన ఇరుసవడ్ల విజయ కుమారుడి చదువు కోసం నగరానికి వచ్చి ఉప్పల్ చిలుకానగర్‌లో ఉంటోంది. మూడేళ్ల క్రితం ఆమె సర్వైకల్ స్పాండిలైటిస్, డోరసల్ స్పాండిలైటీస్ అనే వ్యాధి బారిన పడింది.

వైద్యం కోసం దాదాపు రూ. 6 లక్షల వరకు ఖర్చు చేసింది. ఆపరేషన్ చేస్తే తప్ప నయం కాదని, రూ.10 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు వెల్లడించినట్లు విజయ ‘సాక్షి’కి తెలిపారు.  తన చదువు కోసం జీవితాన్ని ధారపోసిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే కుమిలిపోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని కుమారుడు నరేష్ ఆవేదనతో తెలిపారు. దాతలు   ఆర్థిక సహాయం చేస్తే తన తల్లిని కాపాడుకుంటానని  విజ్ఞప్తి చేశారు. సహాయం చేయదల్చుకున్న దాతలు 9989291559లో సంప్రదంచవచ్చు. లేదా   హైదరాబాద్ దుగ్గొండి శాఖలోని ఐ.నరేష్  ఎస్‌బీ ఐ ఖాతా నంబర్: 62457833963లో జమచేయొచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement