ఏలూరు (సెంట్రల్): కృష్ణా డెల్టా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం వరి దుబ్బులతో ధర్నా చేశారు.
కృష్ణా డెల్టా ఆయకట్టును ఆదుకోండి
Aug 16 2016 10:50 PM | Updated on Sep 4 2017 9:31 AM
ఏలూరు (సెంట్రల్): కృష్ణా డెల్టా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం వరి దుబ్బులతో ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో మన జిల్లాకు చెందిన 58 వేల ఎకరాల్లో సాగునీరు ప్రశ్నార్థకంగా మారిందని, జూలై 16లోపు నీరందిస్తామన్న అధికారులు, పాలకులు మాటలు నీటిమూటలుగానే మిగిలాయని విమర్శించారు. మురుగు నీరు, వర్షం నీటితో కొద్ది ఆయకట్టులో నాట్లు వేయగా ప్రస్తుతం నీరందక ఎండిపోతున్నాయన్నారు. పోణంగి పుంత పనులు తక్షణమే పూర్తి చేసి ఏలూరు మండలాల్లోని గ్రామాలకు సాగునీరందించాలని, కృష్ణా ఆయకట్టుకు సాగు నీరందించడంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం నాయకులు మావూరి శ్రీనివాసరావు, పైడిపాటి భాస్కరరావు, పి.పెద్దియ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement